హైదరాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో ఓ వివాహిత తన పాపని తీసుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. వారాసిగూడలో నివాసం ఉంటున్న సాయికిరణ్, లత దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజులు బాగానే సాగినా కాపురంలో చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న భర్తతో... లత కొత్త బట్టలు కొనివ్వమని అడిగింది. సాయికిరణ్ కుదరదని చెప్పడం వల్ల... తనకు కావాల్సిన వస్తువులు తేవట్లేదని అతనితో మాట్లాడడం మానేసింది. కోపం మరింత పెంచుకొని ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పాపని తీసుకొని వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారిని, బంధువులను, స్నేహితులను అడిగినప్పటికీ... ఎలాంటి సమాచారం లభించలేదు. భార్య ఆచూకీ ఎంతకీ తెలియకపోవడం వల్ల భర్త చిలకలగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. లత గతంలో కూడా ఒకసారి ఇలాగే అలిగి బంధువుల ఇంటికి వెళ్లిందని సాయికిరణ్ తెలిపాడు.
'బట్టలు కొనివ్వలేదని ఇంట్లోంచి వెళ్లిపోయిన గృహిణి ' - INTLONCHI VELLIPONA
ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో భార్య ఓ చిన్న కోరిక కోరింది. భర్త తీర్చలేనని చెప్పాడని ఇంట్లోంచి వెళ్లిపోయింది.
'బట్టలు కొనివ్వలేదని ఇంట్లోంచి వెళ్లిపోయిన గృహిణి '