ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలకడ మండలంలో విషాదం జరిగింది. మండలంలోని నడిమిచర్ల పరిధి మొటుకు గ్రామంలో బండ రాళ్లు కొడుతుండగా ఒకరు మృతిచెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంటి పనులకోసం బండ రాళ్లను కొడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
బండరాళ్లు కొడుతూ వ్యక్తి మృతి... ఇద్దరికి గాయాలు - చిత్తూరులో నేర వార్తలు
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలకడలో విషాదం జరిగింది. బండ రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు అది తగిలి ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బండరాళ్లు కొడుతూ వ్యక్తి మృతి... ఇద్దరికి గాయాలు
మృతుడు రెహమాన్, గాయపడిన వారు ముబారక్, అక్బర్లుగా గుర్తించారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
TAGGED:
చిత్తూరులో నేర వార్తలు