సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం... ఒకరు మృతి - DCM crashes into two wheeler
నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఓ డీసీఎం డ్రైవర్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం... ఒకరు మృతి bike accident in secundereabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7418236-500-7418236-1590915864798.jpg)
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం... ఒకరు మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు మౌలాలికి చెందిన ధన చారిగా పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా