కాబోయే భర్త కోసం ఎన్నో కలలు కనింది. తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది రుక్సానా. కొత్త కొత్త కలలతో నూతన జీవితంలోకి అడుగు పెట్టిన రుక్సానాకి నిరాశే ఎదురైంది. నీవు అందంగా లేవంటూ భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న సాకుతో విడాకులిమ్మని అడిగాడు భర్త ముస్తఫా. లేదంటే అదనపు కట్నం తేవాలంటూ వేధించాడు. పెళ్లై మూడు నెలలు గడవకముందే తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని రుక్సానా కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి భర్త ముస్తఫాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'
పెళ్లైన తెల్లారి నుంచే భార్యపై వేధింపులకు పాల్పడ్డాడో యువకుడు. నువ్వు అందంగా లేవు, పళ్లు ఎత్తుగా ఉన్నాయంటూ వేధించాడు. మూడు నెలలు కాగానే... తలాక్ చెప్పి జారుకున్నాడు.
'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'