ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సెలెక్ట్ టాకీస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బొల్లారంకు చెందిన శేషు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా... మరో వ్యక్తి కోటేశ్వరరావు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు శేషుకు ఒక్క కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శేషు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఓ వ్యక్తి మృతి - died
హైదరాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరోవ్యక్తికి గాయాలయ్యాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఓ వ్యక్తి మృతి