హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు కోటి 68 లక్షల రూపాయల విలువైన 11 క్వింటాళ్ల 21కిలోల గంజాయిని పట్టుకున్నారు. పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీల్లో గంజాయిని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. మహారాష్ట్ర షోలాపూర్ శీలేరు ఏజెన్సీ నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయి తరలిస్తునట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కోటి 68 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత - ganjayi pattivetha
మత్తు పదార్థల నివారణకు అధికారులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకొన్నా పరిస్థితిలో మార్పు రావటంలేదు. హైదరాబాద్ సమీపంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద సుమారు కోటి 68 లక్షల రూపాయల విలువచేసే గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
కోటి 68 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత