One Crore Saplings Plantation Telangana 2023 :స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 12న తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వజ్రోత్సవాల ప్రారంభం సమయంలోనూ 2022 ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం(Haritha Haram) కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు అన్నివర్గాల వారిని కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసి పల్లె, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. అదే తరహాలో ముగింపు ఉత్సవాల సందర్భంగా కూడా మరోమారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్
Independence Day Celebrations Telangana 2023 :అందుకు అనుగుణంగా ఈ నెల 12న ఒకే రోజు కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. సీఎం కేసీఆర్ చిల్కూర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌కు చెందిన మంచిరేవుల ప్రాంతంలోని ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటే అవకాశం ఉంది.
Swatantra Bharata Vajrotsavalu 2023 :మరోవైపు.. వజ్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రంలోని 582 థియేటర్లలో విద్యార్థులకు 'గాంధీ'(Gandhi Movie) చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను థియేటర్ల వద్దకు తీసుకొచ్చి.. తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 'గాంధీ' చిత్ర ప్రదర్శనపై బుధవారం సమావేశం నిర్వహించారు.