ఈఎస్ఐ ఐఎంఎస్ విభాగం కుంభకోణం కేసులో నిందితుల అక్రమాల పరంపర కొనసాగుతూ ఉంది. ఐఎంఎస్ మాజీ సంచాలకురాలు దేవికరాణి, నాగలక్ష్మి అక్రమాలకు అంతు లేకుండా పోయినట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఇటీవలే స్థిరాస్తి రంగంలో వారిద్దరు పెట్టుబడిగా పెట్టిన రూ. నాలుగు కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు... బినామీ పేర్ల మీద వారు మరో రూ. కోటి ఇరవై తొమ్మిది లక్షల ముపై వేలు పెట్టుబడిగా పెట్టినట్టు బయటపడింది.
ఈఎస్ఐ కుంభకోణం: బినామీ పేర్లతో రూ. కోటికిపైగా పెట్టుబడి - ఈఎస్ఐ కుంభకోణంలో బినామీ పేర్లతో రూ. కోటికిపైగా పెట్టబడి
ఐఎంఎస్ మాజీ సంచాలకురాలు దేవికరాణి, నాగలక్ష్మి అక్రమాలకు అంతు లేకుండా పోయినట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. తాజాగా ... బినామీ పేర్ల మీద వారు మరో రూ. కోటి ఇరవై తొమ్మిది లక్షల ముపై వేలు పెట్టుబడిగా పెట్టినట్టు బయటపడింది. ఈ సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో అనిశా అధికారులు కోర్టులో డిపాజిట్ చేశారు.
ఈఎస్ఐ కుంభకోణం: బినామీ పేర్లతో రూ. కోటికిపైగా పెట్టబడి
మొత్తం ఆరు ఫ్లాట్ల కోసం వీరిద్దరు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరు మీద ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టు వెల్లడైంది. సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో అనిశా అధికారులు కోర్టులో డిపాజిట్ చేశారు.
Last Updated : Sep 12, 2020, 6:18 AM IST