హరితహారం కార్యక్రమం కోసం సిద్ధం చేసిన నర్సరీలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తనిఖీ చేశారు. ఇప్పటికే కోటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, మరో కోటి 20లక్షల మొక్కలను ప్రైవేటు నర్సరీల నుంచి సేకరించేందుకుగాను టెండర్లు పిలిచామని కమిషనర్ పేర్కొన్నారు. మరో పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తై ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు జీహెచ్‌ఎంసీకి అందుతాయని తెలిపారు. హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం కోసం రాజేంద్రనగర్, కొంగరకలాన్‌లోని నర్సరీలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ అదనపు కమిషనర్ అమ్రపాలి, కృష్ణతో కలిసి తనిఖీ చేశారు.
'హరితహారం కోసం కోటిమొక్కలు సిద్ధం' - ghmc commitionar
హరితహారం కార్యక్రమానికి దాదాపు కోటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. రాజేంద్రనగర్, కొంగరకలాన్‌లోని నర్సరీలను అదనపు కమిషనర్ అమ్రపాలి, కృష్ణతో కలిసి తనిఖీ చేశారు.
దాదాపు 20లక్షల కూరగాయలకు సంబంధించిన మొక్కలను పెంచాలని సూచించినట్లు పేర్కొన్నారు. మరో వారం పది రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉన్నందున గ్రేటర్ లోని అన్ని వార్డుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ప్రతి వార్డులో రెండు లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని దానికోసం ఆయా వార్డుల్లోని ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించాలని కమిషనర్ వివరించారు. నగరంలో ఉన్న 3400పైగా కాలనీ సంక్షేమ సంఘాలను హరితహారం కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి: కైలాసం నుంచి విభూది రాలడం చూశారా?