One Crore Plants Planted in Telangana State Wide : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ప్రభుత్వం కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెలు, పట్టణాల్లో కోటి మొక్కలు నాటేందుకు నడుంబిగించారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరు ఫారెస్ట్ బ్లాక్‌లో కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పరిధిలోని.. మంచిరేవుల వద్ద అటవీ అభివృద్ధి సంస్థ 360 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం.. ఈ ట్రెక్ పార్కులో మొక్కలు నాటారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు.. కోటి వృక్షార్చలో పాల్గొని మొక్కలు నాటాలని వారు కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ అదనపు ఆకర్షణగా నిలువనుంది. పార్క్‌లో వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, తదితర సదుపాయాలు కల్పించారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కునంతా మంత్రులు ప్రత్యేక వాహనంలో కలియదిరిగారు.
Ministers and MLAs Participated Haritha Haram Programme in Telangana: ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పురపాలక పరిధిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కలెక్టర్ యాస్మిన్ భాషా మెుక్కలు నాటారు. ఊరు చివర్లో పండ్ల మొక్కలు సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, హనుమకొండ జిల్లా శాయంపేట, పెద్దకోడపాక గ్రామాల్లో.. జెడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి మొక్కలు నాటారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో.. విద్యార్థులతో కలిసి డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.