ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినుల వసతి గృహంలో చొరబడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన పోటెల రమేష్, కాచిగూడకు చెందిన సన్నితో కలిసి విద్యార్థినుల వసతి గృహంలోకి చొరబడ్డారు. రమేష్ కత్తితో విద్యార్థినిని బెదిరించి చరవాణి అపహరించాడు. బాధితురాలు కేకలు వేయడం వల్ల రమేష్, సన్ని ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని సీపీ తెలిపారు. వీరిపై గతంలో కేసులు ఉన్నట్లు అంజనీకుమార్ పేర్కొన్నారు. మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తి అరెస్ట్ - ఓయూ విద్యార్థినుల హాస్టల్లో చోరీ
ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
![ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తి అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4223858-863-4223858-1566576320101.jpg)
ఓయూ విద్యార్థినుల హాస్టల్లో చోరీ కేసులో ఒకరు అరెస్ట్
ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఇవీ చూడండి: 'ఇదేం భద్రత ?? ఇకనైనా గస్తీ పెంచండి'