Tirumala: తిరుమలలో భక్తులను మరోసారి ఏనుగులు ఆందోళనకు గురిచేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు సమీపంలోని ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 7 ఏనుగులు ఘాట్‌రోడ్డు సమీపంలోకి రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న తితిదే అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించారు.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగులు.. భయం గుప్పిట్లో భక్తులు - tirumala news
Elephants in Tirumala: తిరుమలలో భక్తులను ఏనుగులు మరోసారి భయపెట్టాయి. మొదటి కనుమదారి ఏనుగుల ఆర్చ్ వద్ద ఏడు ఏనుగులు సంచరించాయి. గజరాజుల రాకతో.. వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
![తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగులు.. భయం గుప్పిట్లో భక్తులు TIRUMALA ELEPHANTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15664444-788-15664444-1656251044584.jpg)
TIRUMALA ELEPHANTS
గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఏనుగుల గుంపు ఘాట్ రోడ్డు సమీపంలోకి రావడం వారంలో ఇది రెండోసారి. గుంపులో సుమారు ఏడు ఏనుగులు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఏనుగులు.. భయం గుప్పిట్లో భక్తులు
ఇవీ చూడండి: