తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో కన్నుల పండువగా ఓనమ్ - Onam_Celebrations

సికింద్రాబాద్​లో లాస్యద్రుత్ సాంస్కృతిక శిక్షణా కేంద్రంలో ఓనమ్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. కేరళ సాంస్కృతిక వస్త్రధారణతో ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను జరుపుకున్నారు.

నగరంలో కన్నుల పండుగగా ఓనమ్ వేడుకలు

By

Published : Sep 22, 2019, 11:19 PM IST

నగరంలో కన్నుల పండుగగా ఓనమ్ వేడుకలు

సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఓనమ్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక సూర్య ఎంక్లేవ్‌లో లాస్యద్రుత్ సాంస్కృతిక శిక్షణా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉత్సవాల్లో మలయాళం సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వీణ కచేరీలతోపాటు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ సాంస్కృతిక వస్త్రధారణతో ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకల్లో పాల్గొన్నారు. కేరళ కళలు, కళాకారులను ప్రోత్సహించడానికి సంగీత సాహిత్యాలలో మరింత ముందుకు వెళుతున్నట్లు లాస్య ద్రుత్ కేరళ సంగీత సాహిత్య సెంటర్ నిర్వాహకురాలు అనిత తెలిపారు. కేరళకు చెందిన పలువురు కళాకారులు వీణ మృదంగ వాయిద్యాలతో అబ్బురపరిచారు.

ABOUT THE AUTHOR

...view details