హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో కేరళ నర్సులు ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పువ్వులతో సుందరంగా అలంకరించిన రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో అపోలో ఆస్పత్రి జాయింట్ డైరెక్టర్ సంగీతారెడ్డి పాల్గొన్నారు. నర్సులతో కలిసి స్వీయచిత్రాలు తీసుకుని వారికి ఓనం శుభాకాంక్షలు తెలిపి వారిలో ఉత్సాహం నింపారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల ఉద్యోగుల్లో నూతన ఉత్తేజం వస్తుందని ఆమె తెలిపారు. తోటి ఉద్యోగులతో కలిసి ఓనం వేడుకలను ఆసుపత్రిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేరళీయులు సంతోషం వ్యక్తం చేశారు.
అపోలో ఆస్పత్రిలో ఘనంగా ఓనం వేడుకలు - onam
కేరళీయుల సంప్రదాయ పండుగ ఓనం వేడుకలు భాగ్యనగరంలోని అపోలో ఆస్పత్రిలో వైభవంగా నిర్వహించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కేరళ నర్సులు జరుపుకున్న ఓనం వేడుకలు ఆకట్టుకున్నాయి.
అపోలో ఆస్పత్రిలో ఘనంగా ఓనం వేడుకలు