తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవం.. ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

Republicday Celebrations at Rajbhavan: హైకోర్టు ఆదేశాలతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా... రాజ్​భవన్‌లోనే పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో... సీఎస్ శాంతికుమారి సమావేశం నిర్వహించారు.

Rajbhavan
Rajbhavan

By

Published : Jan 25, 2023, 8:07 PM IST

Republicday Celebrations at Rajbhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్​భవన్‌లోనే కవాతుతో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజ్​భవన్‌లోనే పరేడ్ నిర్వహించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల తర్వాత పోలీసు అధికారులు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు.

డీజీపీ అంజనీకుమార్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రోటోకాల్ సంచాలకులు అర్విందర్ సింగ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజ్​భవన్‌లో వేడుకల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పోలీసు, ఇతర శాఖల అధికారులు రాజ్​భవన్‌కు వెళ్లారు. వేడుకలకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. రాజ్​భవన్‌ ప్రాంగణంలో పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలు రాజ్ భవన్ ప్రాంగణంలో పరేడ్ కోసం రిహార్సల్స్ కూడా నిర్వహించాయి.

హైకోర్టు కీలక ఆదేశాలు :అంతకుముందు గణతంత్ర వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గణతంత్ర దినోత్సవ వేళ పరేడ్ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు జరపటం లేదని .. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదని పిటిషన్‌ వేశారు. సర్క్యులర్ ప్రకారం పరేడ్, ఇతర కార్యక్రమాలు జరపడం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... గణతంత్ర దినోత్సవం వేళ పరేడ్‌ నిర్వహించాలని ప్రజలను అనుమతించాలని ఆదేశించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు... కేంద్ర మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవం జరపాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ తీరుపై మండిపడిన బీజేపీ నేతలు : పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా గణతంత్ర వేడుకలు నిర్వహించకపోవడం, గవర్నర్‌కు పిలుపు లేకపోవడంపై రాష్ట్ర ప్రథమపౌరురాలు తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తిని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించాలన్న స్ఫూర్తి కొరవడిందని ధ్వజమెత్తారు. రిపబ్లిక్​ డే జరపాలని హైకోర్టు చెప్పాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. హైకోర్టు తీర్పుతోనైనా కనువిప్పు కలగాలని చురకలు అంటించారు. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ప్రోటోకాల్‌ ప్రకారమే సర్కార్‌ నడుచుకుంటుందని వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details