తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున 'అధి శ్రవణ మహా రుద్రయాగం' - హైదరాబాద్‌ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 17న హైదరాబాద్‌లో అధి శ్రవణ మహా రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు... రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో మహా రుద్ర యాగం గోడ పత్రికను ఆవిష్కరించారు.

On the occasion of CM KCR's birthday 'Adhi Shravana Maha Rudra Yagam' in hyderabad
సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున 'అధి శ్రవణ మహా రుద్రయాగం'

By

Published : Feb 16, 2021, 12:27 PM IST

సీఎం కేసీఆర్ 67 వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ మహా రుద్రయాగం నిర్వహిస్తున్నట్లు... రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఈ యాగాన్ని తలపెట్టినట్లు ఆయన చెప్పారు. దోమలగూడలో బ్రహ్మశ్రీ ఈశ్వర సురేష్ శర్మ తదితరులతో కలిసి మహా రుద్రయాగం గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.

రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడా జరగని విధంగా అధి శ్రవణ మహా రుద్రయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాగానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. యాగం చేయడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఇదీ చదవండి: కొండగట్టు అంజన్న దర్శనానికి బారులుతీరిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details