తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై.... నేడు ఉభయసభల్లో చర్చ జరగనుంది. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి.... ఈనెల 8న రూ. లక్షా 82 వేల కోట్లతో తెరాస సర్కార్ వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. రెండురోజుల విరామం అనంతరం ఉభయసభలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి.
వార్షిక బడ్జెట్‌పై... నేడు ఉభయసభల్లో చర్చ
ఈనెల 8న రూ. లక్షా 82 వేల కోట్లతో తెరాస సర్కార్ వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. రెండురోజుల విరామం అనంతరం ఉభయసభలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి.
నేడు ఉభయసభల్లో చర్చ
బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు శాసనసభ, మండలిలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వంతెనలు, గురుకుల పాఠశాలలు, పాతబస్తీకి మెట్రో రైలు, మెట్రో రైల్ విస్తరణ తదితర అంశాలు చర్చకు రానున్నాయి. వరి పంటకు నీరు, ఆరోగ్యసూచిక, డయాలసిస్ కేంద్రాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు, పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది నియామకం తదితర అంశాలు.... మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి.