ఆన్లైన్లో కారు కొందామనుకొని రూ.86 వేలు పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ లాల్‌దర్వాజకు చెందిన శ్యాంకుమార్ కారు కొందామని ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించాడు. ఓ కారు నచ్చి అందులో నంబర్‌కు ఫోన్ చేశాడు. సదరు వ్యక్తి తాను ఆర్మీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. గుజరాత్‌కు బదిలీ అయిందని... అందుకే కారు అమ్ముతున్నట్లు నమ్మించాడు.
ఆర్మీ అధికారినని నమ్మించి.. రూ.85 వేలు దోచేశాడు.! - online news
ఓఎల్ఎక్స్ ముసుగులో సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు. ఆర్మీ అధికారినంటూ... పరిచయం చేసుకుని.. వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యిందని చెప్పి.. తక్కువ ధరలకే వస్తువులను ఎరగా వేసి అమాయకుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసానికి హైదరాబాద్ లాల్‌దర్వాజకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు.
![ఆర్మీ అధికారినని నమ్మించి.. రూ.85 వేలు దోచేశాడు.! olx cyber cheaters in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8075643-909-8075643-1595068226046.jpg)
olx cyber cheaters in hyderabad
ఇద్దరి మధ్య రూ.లక్షన్నరకు బేరం కుదిరింది. కారు డెలివరీ ఇవ్వాలంటే ముందు 50 శాతం నగదు ఆన్లైన్లో చెల్లించాలని చెప్పగా... బాధితుడు డబ్బులు వేశాడు. ఆ తర్వాత ఫోన్ చేయగా... స్పందన లేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు... హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.