తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబులెన్స్​ను చూసింది... ప్రాణాలు వదిలేసింది.. - అంబులెన్స్ చూడగానే...ఆయువు వదిలింది

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా కోడూరులో కరోనా సోకిన ఓ వృద్ధురాలు అంబులెన్స్​ను చూడగానే ప్రాణాలు విడిచింది. బాధితురాలిని కొవిడ్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఈ ఘటన జరిగింది. వైరస్​ భయంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

old-women-died-in-kadapa-over-corona-fear
అంబులెన్స్​ను చూడగానే... ప్రాణాలు వదిలేసింది

By

Published : Jul 13, 2020, 7:32 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా కోడూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు గాను అంబులెన్స్​ వచ్చింది.

ఇంతవరకు బాగానే ఉన్నా... వాహనాన్ని చూడగానే భయంతో వృద్ధురాలు కుప్పకూలిపోయింది. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలి కుటుంబసభ్యులు విదేశాల్లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:గ్రేటర్‌లో కలవరపరుస్తోన్న కేసులు.. కొత్త ప్రాంతాల్లో అత్యధికం

ABOUT THE AUTHOR

...view details