తెలంగాణ

telangana

ETV Bharat / state

old woman story : ఆ అవ్వకు అయినవారికంటే.. అక్షరాలే నేస్తాలు! - హైదరాబాద్ వార్తలు

old woman story : సాధారణంగా వయసు పైబడినటువంటి ముసలవ్వలు ముచ్చట్లు ఇష్టపడతారు. నలుగురితో కూర్చొని కాలక్షేపం చేస్తారు. కానీ ఈ అవ్వ కాస్త డిఫరెంట్. ఆమెకు అయినవారికంటే... అక్షరాలే నేస్తాలు.

old woman story, news reader old woman
అవ్వకు అయినవారికంటే.. అక్షరాలే నేస్తాలు!

By

Published : Jan 1, 2022, 8:33 AM IST

old woman story : హైదరాబాద్‌కు చెందిన ఈ వృద్ధురాలి పేరు సాధుభాయి. కుటుంబంలో ఏర్పడిన చిన్న గొడవల కారణంగా పదిహేనేళ్లుగా ఇంటిని వదిలి రోడ్డుపై కాలం గడుపుతున్నారు. పదమూడు సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ, అడిక్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో రహదారిపైనే ఉంటూ కాలం గడిపారు. తన పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారని, వారిని ఎలాంటి సాయం అడగనన్నారు. తమతో రమ్మని వారు కోరినా ఇష్టం లేక వెళ్లడం లేదని చెప్పారు. బర్కత్‌పురకు వచ్చి రెండు సంవత్సరాలు గడిచిందని, తన దీనస్థితిని చూసి ఓ దాత ఈ పరిసరాల్లోనే చిన్న గూడు కల్పించారని సాధుభాయి చెప్పారు.

రాత్రి సమయంలో అందులో ఉంటూ ఉదయం ఫుట్‌పాత్‌పై కూర్చుని పేపర్‌ చదువుకుంటానని, డబ్బుల కోసం తానెవరినీ యాచించనన్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్నానని ప్రతి రోజూ ఈనాడు పేపర్‌తో పాటు వారంలో రెండు రోజులు ఆంగ్ల దినపత్రికను కొని చదువుతానని ఆమె వివరించారు.

ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలతో హోరెత్తిన నగరాలు

ABOUT THE AUTHOR

...view details