ఆంధ్రప్రదేశ్ విశాఖలోని అల్లిపురం యల్లపువారి వీధికి చెందిన ఓ వృద్ధుడికి బుధవారం సాయంత్రం కొవిడ్ నిర్ధరణ అయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతనికి దూరంగా ఉన్నారు. ఆ వృద్ధుడిని గురువారం సాయంత్రం వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి 7 గంటల సమయంలో అంబులెన్సు వచ్చింది.
అంబులెన్స్ ఎక్కేలోపే ప్రాణం విడిచిన కరోనా బాధితుడు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కొవిడ్‌తో ఓ వృద్ధుడు మరణించిన తీరు చూపరులను కలచి వేసింది. వైరస్ సోకిన అతను చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు బయలుదేరాడు. అంబులెన్స్ కూడా వచ్చింది. ఎక్కేందుకు ఇంటిబయటకు వచ్చిన వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
అంబులెన్స్ ఎక్కేలోపే ప్రాణం విడిచిన కరోనా బాధితుడు
వృద్ధుడు అంబులెన్స్ ఎక్కకుండానే తీవ్ర ఆయాసంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. శ్వాసకోస సమస్య తీవ్రం కావడంతో ఊపిరి అందక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూపరులను కలచివేసింది.