హైదరాబాద్ పాతబస్తీ కాల పత్తర్‌లో ఈ నెల 9న జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చార్మినార్ ఏసీపీ అంజయ్య వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. పాత కక్షల కారణంగానేసయ్యద్ ముక్తార్ అలీ హత్య జరిగినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్టైన వారి నుంచి ఒక కత్తి, బ్యాట్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసున్నట్లు పేర్కొన్నారు.
పాతబస్తీ హత్య కేసులో వీడిన మిస్టరీ - వీడిన మీస్టరీ
పాతబస్తీ కాల పత్తర్‌లో సంచలనం రేపిన హత్య కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది.
మృతుడు సయ్యద్ ముక్తార్ అలీ కాలపత్తర్ చున్నేకిబట్టి ప్రాంతంలో నివాసముండేవాడని... గతంలో రంజాన్ మాసంలో ఇతనితో జరిగిన గొడవ కారణంగానే 9 మంది కలిసి దారుణంగా హత్య చేశారని ఏసీపీ తెలిపారు. నిందితుల్లో చున్నేకిబట్టి మిశ్రిగంజ్‌లో ద్విచక్ర వాహన డీలరైన అహ్మద్ బిన్ సలాం, జహనుమాకు చెందిన విద్యార్థి హసన్ బిన్ రవూఫ్, అబ్బు మిశ్రి అలీబాగ్, సమాద్ మిశ్రి, వాజిద్ అలీ, హైదర్ మొహినుద్దీన్ లను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వివరాలను వెల్లడించారు.
ఇదీ చూడండి : సరళతరం కానున్న ఆల్కాహాల్ రవాణా