ఎంజీబీఎస్ ప్రధాన రహదారి దారుల్ షిపా ప్రాంతంలో పురాతన భవనం బాల్కనీ గోడ కింద భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద అంతస్తులో దుకాణాలు ఉన్నాయి. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలు మూసివేసి ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. పురతనమైన భవనం కావడం వల్ల కూలిపోయినట్లు తెలుస్తోంది. ఆ భవనంలో కొందరు నివసిస్తున్నారు. ఇలాంటి వాటిని తక్షణమే కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కుప్పకూలిన పాత భవనం.. తప్పిన ప్రమాదం
పాతబస్తీలోని పురాతన భవనం బాల్కనీ గోడ కుప్పకూలింది. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పైన జనసంచారం లేనందున పెను ప్రమాదం తప్పింది.
కుప్పకూలిన పాత భవనం.. తప్పిన ప్రమాదం