సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో గల కాళీ దుర్గ భవానిమాత ఆలయ పునః ప్రతిష్ట 8వ వార్షికోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు లేకుండా.. హంగు ఆర్భాటాలు లేకుండా ఈ సారి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పరిమిత సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ.. గణపతి హోమం, అమ్మవారికి అభిషేకం, 11 కలశాల పూజ, అమ్మవారికి అలంకరణ వంటి కార్యక్రమాలు చేశారు.
నిరాడంబరంగా కాళీదుర్గ ఆలయ 8వ వార్షికోత్సవం - Old Boyinpallyy Bhavani Devi Temple 8th Anniversary
కరోనా నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి భవాని నగర్లో గల కాళీ దుర్గ భవాని ఆలయ పునః ప్రతిష్ట 8వ వార్షికోత్సవ సంబరాలు నిరాడంబరంగా జరిగాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ పూర్తిగా నాశనమైపోవాలని కోరుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నిరాడంబరంగా కాళీదుర్గ ఆలయ 8వ వార్షికోత్సవం
కరోనా మహమ్మారి పూర్తినా నశించి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. వచ్చే సంవత్సరం అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు వైభవంగా జరుపుతామని తెలిపారు. భక్తులు, ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి