హైదరాబాద్ మెహిదీపట్నం పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ ఫిల్లర్ నెంబర్ 31 వద్ద.. ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ తీసుకెళ్తున్న ట్రాలీ సుమో అదుపు తప్పి కింద పడింది. ట్రాలీ సుమోలోని ఆయిల్ లీక్ కావడంతో భారీగా ట్రాఫీక్ జామ్ అయింది.
ఆయిల్ ట్రాలీ బోల్తా..పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ - పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ తీసుకెళ్తున్న ట్రాలీ సుమో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆయిల్ పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరడం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది.
![ఆయిల్ ట్రాలీ బోల్తా..పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ Oil trolley overturns traffic jam issue at Mehdipatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10629129-1009-10629129-1613328633410.jpg)
ఆయిల్ ట్రాలీ బోల్తా..పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
ఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్‌నగర్ ట్రాఫీక్ పోలీసులు ట్రాన్స్ఫార్మర్ను అక్కడ నుంచి తొలగించి ట్రాఫీక్ క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇదీ చూడండి :అప్పు చేసి రోడ్డేసిన.. ఇంకా పైసలు రాలే: మంత్రితో సర్పంచ్