గవర్నర్‌తో ముగిసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారుల సమావేశం.. ఆ అంశాలపై చర్చ - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
20:00 January 30
బడ్జెట్ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించిన మంత్రి, అధికారులు
Telangana Budget Sessions 2023 : బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగం ఉండాలన్న తాజా నిర్ణయం నేపథ్యంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోగా.. ఆ వెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.
ప్రగతిభవన్ నుంచి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. ఉభయ సభలో ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: