తెలంగాణ

telangana

ETV Bharat / state

METRO gates closed: మెట్రోకు పోటెత్తిన భాజపా శ్రేణులు.. గేట్లు మూసేసిన అధికారులు

METRO gates closed: పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. భాజపా శ్రేణులు పోటెత్తడంతో అధికారులు ముందు జాగ్రత్తగా గేట్లు మూసేశారు. తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా చర్యలు తీసుకున్నారు. భద్రతా కారణాలతో ఉదయం నుంచి మూసేసిన మెట్రోస్టేషన్ సభ ముగియగానే తెరిచారు.

METRO gates closed
పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్

By

Published : Jul 3, 2022, 10:21 PM IST

METRO gates closed: పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్​కు భాజ‌పా శ్రేణులు తరలిరావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా గేట్లు మూసివేశారు. స్టేషన్​లో తొక్కిసలాట జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టారు. భాజపా విజ‌య సంక‌ల్ప స‌భ ముగియగానే భాజ‌పా శ్రేణులు ఒక్క‌సారి స్టేషన్​కు పోటెత్తడంతో కాసేపు నీరిక్షించాల్సి వచ్చింది. దీంతో అధికారులు గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మెట్రో స్టేషన్​కు ఒకేసారి వేలాది మంది రావ‌డం.. అప్ప‌టికే టిక్కెట్ కౌంట‌ర్లు, ఫ్లాట్ ఫాంపై జ‌నం ర‌ద్దీగా ఉండ‌టంతో ప్ర‌యాణికుల‌ను అదుపు చేసేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. గేట్లు మూసేసిన మెట్రో సిబ్బంది క్ర‌మ క్ర‌మంగా ప్ర‌యాణికుల‌ను లోప‌లికి అనుమతించారు. అంత‌కుముందు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప్ర‌ధాని భ‌ద్ర‌తా దృష్ట్యా ప్యార‌డైజ్‌, ప‌రేడ్ గ్రౌండ్‌, జేబీఎస్ స్టేష‌న్ల‌ను మూసేశారు. స‌భ ముగిశాకే తిరిగి తెరిచారు.

ABOUT THE AUTHOR

...view details