హైదరాబాద్ భూములు అమ్మడానికి ఏమైనా కేసీఆర్ జాగీరా అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ను చేయాలని అప్పట్లో ప్రతిపాదన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకే ఉండాలని పట్టుబట్టి సాధించిందని గుర్తు చేశారు. నగరంలోని చారిత్రక కట్టడాలను ఓ వైపు కూల్చివేస్తూ.. మరోవైపు విలువైన భూములను అమ్ముతూ హైదరాబాద్‌కు చరిత్ర లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
"హైదరాబాద్ భూములమ్మి ప్రాజెక్టు పూర్తి చేస్తారా" - కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైతే హైదరాబాద్ భూములమ్మి నిధులు సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్
తెలంగాణలో 45 శాతం ఆదాయం ఒక్క హైదరాబాద్ ద్వారానే వస్తుందన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకు భూములు లేవు కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రం హైదరాబాద్ భూములు అమ్మి ఇస్తారా అని నిలదీశారు. భూములు అమ్మి కాకుండా ఇతర వనరుల ద్వారా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అరెస్టు