తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు' - అంబర్​పేటలో మాంసం దుకాణాలపై దాడులు

హైదరాబాద్ అంబర్​పేటలో పశుసంవర్థక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రామచందర్ నేతృత్వంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

officers-raids-on-mutton-shops-in-amberpet
'అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు'

By

Published : Apr 23, 2020, 1:51 PM IST

మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. పశుసంవర్థక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రామచందర్ నేతృత్వంలో హైదరాబాద్ అంబర్​పేటలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. వినియోగదారుల నుంచి నేరుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​కు ఫిర్యాదులు అందాయి. మంత్రి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు సాగాయి.

కరోనా నేపథ్యంలో మేకలు, గొర్రెల లభ్యత తగ్గిపోయిన దృష్ట్యా..‌. అధిక రేట్లు చెల్లించి తెప్పించడం వల్ల ఎక్కువ భారం పడుతోందని... అందువల్లే ధరలు‌ పెంచాల్సి వస్తోందని వ్యాపారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత బట్టి రూ. 680 నుంచి రూ. 760కి మించి మాంసం విక్రయించవద్దని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ రామచందర్ హెచ్చరించారు.

ఇవీచూడండి:విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details