తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం చేపలు రాబోతున్నాయ్​ - కాళేశ్వరంలో చేపల పెంపకం

కాళేశ్వరం ప్రాజెక్టులో చేపల పెంపకం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మూడు జిల్లాల్లో 30 గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. చేపలు వదిలేందుకు అనువైన ప్రాంతాలను సర్వే ద్వారా గుర్తించారు. నీటి లభ్యత ప్రవాహాన్ని బట్టి పదిరకాల చేపలు, రొయ్యలు పెంచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు

By

Published : Jul 23, 2019, 11:23 AM IST

Updated : Jul 23, 2019, 2:23 PM IST

కాళేశ్వరం చేపలు రాబోతున్నాయ్​

రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులో కోటిన్నర చేప, రొయ్య పిల్లలు వదలాలని మత్స్య శాఖ నిర్ణయించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ప్రాజెక్టుపై బేస్‌లైన్‌ సర్వే చేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసింది. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 30 గ్రామాలకు చెందిన వేలాది మత్స్యకారుల కుటుంబాలకు కాళేశ్వరం జీవనోపాధిగా మారనుందని సర్వే తేల్చి చెప్పింది. చేపలు వదిలేందుకు, పట్టేందుకు అనువైన ప్రాంతాలను సైతం అధికారులు గుర్తించారు. నీటి లభ్యత ప్రవాహాన్ని బట్టి పదిరకాల చేపలు సహా రొయ్యలు పెంచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

19 ప్రదేశాల్లో చేపల వేట

30 గ్రామాల్లోని 19 ప్రదేశాలు వేటకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కాళేశ్వరం నుంచే మొదలు పెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మధ్య ఎక్కడో ఒక దగ్గర చేప పిల్లలు వదిలే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నేటికీ అశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువుల్లోకి నీరు రాలేదు. అందువల్ల కాళేశ్వరంలోనే పంపిణీని ప్రారంభించాలని మత్స్య శాఖ ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.

ఇదీ చూడండి : కన్నెపల్లి రెండో పంపు ట్రయల్​ రన్​ విజయవంతం

Last Updated : Jul 23, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details