తెలంగాణ

telangana

ETV Bharat / state

Office For National Statistics: తెలంగాణలోని గ్రామాల్లో 57.4% మంది ఓబీసీలే - తెలంగాణ వార్తలు

జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువ మంది ఓబీసీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వే (Office For National Statistics Survey) వెల్లడించింది. ఈ సర్వే (Office For National Statistics Survey)లో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీ సగటు 44.4%గా తేలింది.

Office For National Statistics
కేంద్ర ప్రభుత్వ సర్వే

By

Published : Oct 5, 2021, 1:01 PM IST

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఇతర వెనుకబడిన తరగతుల వారు (ఓబీసీలు) 57.4 శాతం మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌.ఎస్‌.ఒ.) (Office For National Statistics) చేసిన సర్వేలో తేలింది. 2018 జులై- 2019 జూన్‌ వ్యవసాయ సంవత్సరంలో ఎన్‌.ఎస్‌.ఒ. గ్రామీణ వ్యవసాయ కుటుంబాల భూములు, పాడి సంపద గురించి అధ్యయనం జరిపింది. ఈ సర్వే (Office For National Statistics Survey)లో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీ సగటు 44.4%గా తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీలు 45.8 శాతం మంది ఉన్నారని పేర్కొంది.

  • ఈ సర్వే ప్రకారం గ్రామీణ వ్యవసాయ కుటుంబాల్లో సగంకన్నా ఎక్కువ ఓబీసీలున్న 7 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ 57.4% గ్రామీణ కుటుంబాలు ఓబీసీలే. ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీ గ్రామీణ కుటుంబాలు 45.8% అయినా, అది అఖిల భారత సగటు 44.4%కన్నా ఎక్కువే.
  • భారతదేశంలో మొత్తం 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉండగా వాటిలో 44.4% ఓబీసీ కుటుంబాలేనని తేల్చింది. 21.6% షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), 12.3 శాతం షెడ్యూల్డ్‌ తెగలకు(ఎస్టీ) చెందినవని తెలిపింది. ఇతర సామాజిక వర్గాలు 21.7 శాతమని పేర్కొంది.
  • 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 9.3 కోట్లు (54%) వ్యవసాయాధారితమైనవి కాగా, వాటిలో 45.8% ఓబీసీలు. 15.9% ఎస్సీలు. 14.2% ఎస్టీలు, మిగతా 24.1% ఇతర సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలని ఎన్‌.ఎస్‌.ఒ. సర్వే (Office For National Statistics Survey) నిగ్గుదేల్చింది.
  • భారతదేశంలో ఓబీసీ జనాభా అత్యధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు: తమిళనాడు (67.7%), బిహార్‌ (58.1%), తెలంగాణ (57.4%), ఉత్తర్‌ ప్రదేశ్‌ (56.3%), కేరళ (55.2%), కర్ణాటక (51.6%), ఛత్తీస్‌గఢ్‌ (51.4%).దేశంలో అతి తక్కువ ఓబీసీ కుటుంబాలు (0.2 శాతం) ఉన్న రాష్ట్రం నాగాలాండ్‌.
  • ఎన్‌.ఎస్‌.ఒ. సర్వే (Office For National Statistics Survey) గ్రామీణ కుటుంబాల ఆదాయం గురించీ వివరాలు తెలిపింది. 2018-19 వ్యవసాయ సంవత్సరంలో జాతీయ స్థాయిలో గ్రామీణ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ.10,218. ఓబీసీ వ్యవసాయ కుటుంబాల ఆదాయం రూ. 9,977, ఎస్సీ కుటుంబాల ఆదాయం రూ. 8,142, ఎస్టీ కుటుంబాల ఆదాయం రూ. 8,979. ఇతర సామాజిక వర్గాల వ్యవసాయ ఆదాయం మాత్రం రూ. 12,806 అని ఎన్‌.ఎస్‌.ఒ. తేల్చింది.

ABOUT THE AUTHOR

...view details