లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉపాధి కోల్పోయి హైదరాబాద్ నగరంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు... స్వరాష్ట్రాలకు చేరుకోవడంలో అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్లో వివిధ చోట్ల పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సుమారు 40 మంది వలస కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను బుక్ చేసుకున్నారు.
బస్సు ఎప్పుడొచ్చేనో... ఇంటికెప్పుడెళ్లేనో.. - odisha migrant workers waiting for go to home
వారంతా వలస కూలీలు బతుకుదెరువు వెతుక్కుంటూ భాగ్యనగరానికి వలసొచ్చారు. లాక్డౌన్ వల్ల ఇన్నాళ్లు నగరంలోనే తీవ్ర ఇంబ్బంది పడ్డారు. స్వస్థలాలకు వెల్లేందుకు కాస్త వెలుసు బాటు దొరకడం వల్ల వాహనం రిజర్వేషన్ చేయుంచుకున్నారు. ఉదయాన్నే రావాల్సిన బస్సు సాయంత్రమైనా రాకపోయేసరికి సికింద్రాబాద్లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు ఒడిశాకు చెందిన కూలీలు.
బస్సు ఎప్పుడొచ్చేనో... ఇంటికెప్పుడెళ్లేనో..
ఇంటికెళ్తున్నామనే సంతోషంలో పొద్దున్నే బయలుదేరి సికింద్రాబాద్లోని మదర్ థెరిసా విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన బస్సు ఎంతకీ రాలేదు. తెచ్చుకున్న ఆహారం తిని... రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. తమ సమస్యను గోపాలపురం పోలీసులకు విన్నవించకోగా... బస్సు యజమాన్యంతో మాట్లాడిన పోలీసులు వారిని ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం సమయంలో బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం