Ocugen Company Investments In Telangana : లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఆక్యుజెన్ సంస్థతో మంత్రి కేటీఆర్ సమావేశాలు జరిపారు. సమావేశాల అనంతరం ఆక్యుజెన్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌తో సమావేశంలో ఆక్యుజెన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆక్యుజెన్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకం అవుతుందని కేటీఆర్ తెలిపారు
హైదరాబాద్‌లో ఆక్యుజెన్ పెట్టుబడులు:జీన్, సెల్‌థెరపీకి సంబంధించి హైదరాబాద్‌లో అభివృద్ధి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆక్యుజెన్ ప్రకటించింది. జీన్‌థెరపీ కోసం కావల్సిన అధునిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో, వైద్యరంగంలో పూర్తిసాంకేతికతతో కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ న్యూయార్క్ పర్యటనలో భాగంగా ఆక్యుజెన్ సహవ్యవస్థాపకుడు డాక్టర్ శంకర్‌ముసునూరి ఛీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ ఇపాధ్యాయలతో సమావేశమయ్యారు. అందులో భాగంగా పరిశోధనా, అభివృధ్ది కేంద్రానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సహకరిస్తున్నందుకు ఆనందంగా ఉందని సంస్థ సీఈఓ శంకర్‌ముసునూరి తెలిపారు. 2030 నాటికి 2 వందల 50 బిలియన్ డాలర్ల ఎకో సిస్టెమ్‌గా మారడమే తమ లక్ష్యమని వివరించారు.
మెడ్‌ట్రానిక్ పెట్టుబడులు:తెలంగాణలో మరో 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్ ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, మెడ్ ట్రానిక్ సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. 350 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు మెడ్‌ట్రానిక్ ముందుకు రావడం సంతోషకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పిన మెడ్‌ట్రానిక్ ఆకేంద్రం విస్తరణలో భాగంగా సుమారు రూ. 3వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అమెరికాకు చెందిన మెడ్ ట్రానిక్ సంస్థ ఆ దేశం వెలుపల మొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పింది.
మైలురాయిగా డిస్కవరీ:కేటీఆర్ అమెరికా పర్యటనలో అతిపెద్ద పెట్టుబడి డిస్కవరీ సంస్థతో జరిగింది. తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఎంట్రీ ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. న్యూయార్క్‌లోని డిస్కవరీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి డిస్కవరీ రంగ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్‌గా ఐడీసీని డిస్కవరీ ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు. డిస్కవరీ తెలంగాణకి వచ్చిన మొదటి ఏడాదిలోని 1200 మందికి ఉపాధి అవకాశాలొస్తాయని, తెలంగాణ అభివృద్ధిలో ఇదొక మైలురాయి అని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: