నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఏవిధంగా అడ్డుకోవచ్చు అనే దానిపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. వాహనదారులను అనువునా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ తరహా మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆక్టోపస్ పోలీసులు తెలిపారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ నగరానికి వస్తుండడం...భాజపా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున మాక్‌డ్రిల్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్‌లో ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్ - OCTOPUS police
తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశిస్తే ఏవిధంగా వ్యవహరించాలి, తనిఖీలు ఎలా చేయాలి అనే అంశాలపై ఆక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేపట్టారు.
![హైదరాబాద్‌లో ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3497324-thumbnail-3x2-octopus.jpg)
ఆక్టోపస్ పోలీసుల మాక్‌డ్రిల్