భాగ్యనగరంలో 2010 నాటికి 3132 చెరువులున్నట్లు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ గుర్తించాయి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం 185 జలాశయాలే ప్రస్తుతం మిగిలాయి. దాదాపు 600 ఆక్రమణలో ఉండటమో పూర్తిగా కనుమరుగవడమో జరిగిందని అధికారులు చెబుతున్నారు. గుర్తించిన చెరువులను నీటిపారుదల శాఖతో కలిసి అభివృద్ధి చేశాయా అంటే అదీ లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో అన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్ధారించినవి 500 లోపే ఉన్నాయి.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
2010లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ తరవాత 18 మంది సభ్యులతో కూడిన చెరువుల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సమావేశమై ఆక్రమణలు తొలగించడంతోపాటు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిటీ 30 సార్లు సమావేశం కాలేదని కాగ్ ఆక్షేపించింది.
నివేదికకు రూ.కోట్లు.. అందక పాట్లు
చెరువుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేందుకు ఓ సంస్థకు హెచ్‌ఎండీఏ రూ.12.62 కోట్లు చెల్లించింది. ఇప్పటికీ ఆ సంస్థ పూర్తి నివేదిక ఇవ్వలేదు.
వేలల్లో చెరువులు.. పదుల్లో సిబ్బంది
వేలల్లో చెరువులంటే హెచ్‌ఎండీఏ వద్ద 20 మంది పరిరక్షణ సిబ్బంది లేకపోవడం గమనార్హం.
ఎఫ్‌టీఎల్‌లోనూ అనుమతులు