తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఎంసీ కేసు: తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా - ఓబుళాపురం గనుల కేసు తాజా వార్తలు

ఓబుళాపురం గనుల కేసుపై హైదరాబాద్​ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు ఐఎఎస్​ శ్రీలక్ష్మి తరపు న్యాయవాది సమయం కోరగా..కోర్టు అనుమతించింది. తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. కేసు విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.

ఓఎంసీ కేసు: తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా
ఓఎంసీ కేసు: తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా

By

Published : Dec 29, 2020, 8:16 PM IST

ఓబుళాపురం గనుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు ఐఏఎస్ శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది సమయం కోరారు. పిటిషనర్​ అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న కోర్టు... తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. అలా వినిపించకపోతే వాదనలు లేనట్లుగానే పరిగణిస్తామని తెలిపింది.

కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా సమయం ఇవ్వాలని సీబీఐ కోరింది. ఓఎంసీ కేసు విచారణను జనవరి 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీ చదవండి :పైప్​లైన్​ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది

ABOUT THE AUTHOR

...view details