తెలంగాణ

telangana

ETV Bharat / state

CLP: ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి - హైదరాబాద్​ వార్తలు

ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకోవాలని సీఎల్పీ(CLP) నిర్ణయం తీసుకుంది. వర్చువల్‌ ద్వారా అత్యవసర సమావేశమైన సీఎల్పీ, ప్రభుత్వ విధానాలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించింది. భూములు విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని భట్టి చెప్పారు.

CLP:  ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి
CLP: ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి

By

Published : Jun 13, 2021, 7:12 PM IST

వర్చువల్‌ ద్వారా సీఎల్పీ(CLP) అత్యవసర సమావేశమైంది. ప్రభుత్వ విధానాలు, ఉద్యమ కార్యాచరణపై చర్చించింది. ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకోవాలని సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. భూములు విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వం తెస్తున్న అప్పులు ప్రమాదకరంగా మారాయని అన్నారు.

తెచ్చిన అప్పులను లెక్కలు లేకుండా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ భూముల విక్రయాలను అడ్డుకున్నామని గుర్తు చేశారు. గవర్నర్‌ను కలిసి భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరతామని చెప్పారు. ఇప్పటికే అమ్మిన భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు.

ఇదీ చదవండి:'సంస్కరణలతోనే కాంగ్రెస్​కు పునరుజ్జీవం'

ABOUT THE AUTHOR

...view details