నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి తొలిగిన అడ్డంకి - ghmc results 2020
14:58 December 07
నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి తొలిగిన అడ్డంకి
నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకి తొలిగిపోయింది. ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లను లెక్కించాలని ధర్మాసనం ఆదేశించింది. నేరేడ్‌మెట్‌లో ఇప్పటికే లెక్కించిన ఓట్లలో తెరాస అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ వచ్చింది. స్టాంపు ఓట్ల విషయంలో ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం సస్పెండ్ చేసింది. స్టాంపు ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువుంటే ఫలితాలన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
నేరేడ్‌మెట్‌లో స్టాంపు ఉన్న ఓట్లు 544 ఉండగా... తెరాస అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని నిలిపివేసి హైకోర్టుకు నివేదించారు. నేరేడ్‌మెట్ ఫలితంపై హైకోర్టుకు ఎస్ఈసీ అప్పీల్ చేయగా... సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని... విచారణ పూర్తయిన తర్వాత కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో నేరేడ్‌మెట్ ఫలితం అంశాన్ని ఈరోజు మొదటి కేసుగా విచారించాలని సింగిల్ జడ్జికి సూచించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి... ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చారు.
ఇదీ చదవండి :ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!