రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భాజపా కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస మంత్రులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గ్రేటర్ ప్రజలు భాజపా వైపే ఉన్నారని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారాసిగూడలో మహంకాళి అధ్యక్షుడు శ్యామ్సుందర్గౌడ్ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కంటోన్మెంట్ను కైవసం చేసుకుంటాం : లక్ష్మణ్
తెరాస నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జీహెచ్ఎంసీలో భాజపా విజయాన్ని అడ్డుకోలేకపోయారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారాసిగూడలో మహంకాళి అధ్యక్షుడు శ్యామ్సుందర్గౌడ్ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో భాజపా నాయకులు
జీహెచ్ఎంసీలో భాజపా గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన కార్పొరేటర్లు మంత్రుల వెంట తిరుగుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గ్రేటర్లో గెలిచిన వారి హక్కులను కాలరాస్తూ ప్రజల తీర్పును సీఎం అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వనరులను దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.