బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో తీవ్ర అన్యాయం జరిగిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఆగస్టు 7న జరిగే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల ఐకాస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీలు ఐక్యమై రాజ్యాధికారం దిశగా సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహాసభలకు ఏడు రాష్ట్రాల నుంచి మంత్రులు, పలు పార్టీల రాజకీయ నాయకులు, జాతీయస్థాయి బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు.
ఓబీసీ మహాసభను విజయవంతం చేద్దాం: జస్టిస్ ఈశ్వరయ్య - బీసీ సంక్షేమం
బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆగస్టు 7న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఓబీసీ మహాసభను విజయవంతం చేద్దాం...జస్టిస్ ఈశ్వరయ్య