Oath Taking Newly Elected MLAs in Telangana Today :కొత్త శాసనసభ నేడు కొలువు తీరనుంది. రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ జరగనుండగా మూడు, నాలుగు రోజుల విరామం తర్వాత సభ తిరిగి సమావేశం కానుంది. సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగం అప్పుడు ఉంటాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi ) సభ్యులచే ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్‌తో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. శాసనసభాపతి ఎన్నిక కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను : రాజా సింగ్
Telangana New Assembly Sessions Starts From Today : రాష్ట్ర మూడో శాసనసభ నేడు కొలువుతీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల పేర్లతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 39చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 8, మజ్లిస్ 7స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ ఒకచోట గెలుపొందింది. నూతన శాసనసభ్యులతో కొత్త శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫారసు మేరకు శాసనసభను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్నోటిఫికేషన్ జారీ చేశారు.
Akbaruddin Owaisi Appointed As protem Speaker of Telangana : ఉదయం 11 గంటలకు కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీకి సభ్యులుగా ఎన్నికైన వారు నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారంతోపాటు సభా కార్యకలాపాల కోసం ప్రొటెం స్పీకర్‌ను నియమించారు. చాంద్రాయణగుట్ట నుంచి 1999 మొదలు ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.