తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు' - ముఖ్యమంత్రి కేసీఆర్​పై విమర్శలు

ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక గుత్తేదారుకు ప్రయోజనం కలిగించేందుకు ముఖ్యమంత్రి... రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ తక్షణమే జరిగేలా చూడాలని కోరారు.

nvss-prabhakar-allegations-on-cm-kcr
'రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు'

By

Published : Aug 11, 2020, 3:32 PM IST

రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఒక గుత్తేదారుకు ప్రయోజనం కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన దుయ్యబట్టారు. కృష్ణా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్​లో చర్చించాలన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తక్షణమే జరిగేలా ఎజెండా పంపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు.

'రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు'

ఇదీ చూడండి:ఏపీ భాజపా అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం

ABOUT THE AUTHOR

...view details