తెలంగాణ

telangana

ETV Bharat / state

రెగ్యులరైజ్ చేయకుంటే సమ్మె తప్పదు.. నిమ్స్​లో నర్సుల వార్నింగ్ - protest of nurses in Nimes

NIMS Nurses Protest: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తమను సీనియార్టీ ప్రాతిపదికన రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే స్కేల్ ఇవ్వాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిమ్స్​లో పనిచేసే నర్సులు డిమాండ్ చేశారు. 12 నుంచి 15 ఏళ్లు పనిచేస్తున్న నిమ్స్​లో తమ ఉద్యోగాలను ప్రభుత్వం పర్మినెంట్ చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

Nurses Protest: తమ విధులను క్రమబద్ధీకరించాలని నిమ్స్​లో నర్సుల ఆందోళన
Nurses Protest: తమ విధులను క్రమబద్ధీకరించాలని నిమ్స్​లో నర్సుల ఆందోళన

By

Published : Apr 1, 2022, 3:33 PM IST

NIMS Nurses Protest: హైదరాబాద్ నిమ్స్​లో నర్సులు ఆందోళన బాటపట్టారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను ప్రభుత్వం పర్మినెంట్ చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సుమారు 1700 మంది నర్సుల అవసరం ఉండగా... 423 మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్నామని పలువురు నర్సులు వాపోయారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తమను సీనియార్టీ ప్రాతిపదికన రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే స్కేల్ ఇవ్వాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిమ్స్​పై దృష్టి సారించి రోగులకు ఇబ్బంది లేకుండా సేవలందించేలా సహకరించాలని కోరారు.

రెగ్యులరైజ్​ చేయాలి.. గత 15 రోజులుగా మా సమస్యలను నిమ్స్​ డైరెక్టర్​కు చెప్తూనే ఉన్నాం. వారు ఈ విషయాలను ఇంకా పెండింగ్​లోనే ఉంచారు. మాకు ఇలా ఆందోళన చేయాలని కానీ.. పేషంట్లకు వైద్యాన్ని ఆపాలనే ఉద్దేశం లేదు. మా సమస్యల పరిష్కారం కోసమే ఇలా బయటకు రావాల్సి వచ్చింది. బేసిక్​ పే స్కేల్​ ఇవ్వాలని చాలా రోజులుగా అడుగుతున్నాం. దానిని పెండింగ్​లో పెట్టారు. 2014 జూన్​ ముందు నుంచి ఉన్నవారిని రెగ్యులరైజ్​ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అలాంటి వారిని రెగ్యులరైజ్​ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత 15 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్​, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావులను కలిసి ప్రజెంటేషన్​ కూడా ఇచ్చాం. ఇప్పటికైనా స్పందించి రెగ్యులరైజ్​ చేయాలని కోరుతున్నాం. గత నాలుగు రోజుల నుంచి ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. రెగ్యులరైజ్​ చేయకపోతే నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. -నిమ్స్​ ఉద్యోగిని

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details