టిమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు... కాంట్రాక్ట్ బేసిక్‌లో నర్సుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా కొందరు అప్లై చేసుకున్నారు. ఈనెల 2న గచ్చిబౌలిలోని టిమ్స్‌లో వారి సర్టిఫికెట్లను సైతం అధికారులు వెరిఫికేషన్ చేశారు. అనంతరం మీరు సెలక్ట్ అయ్యారంటూ మెసేజీలు కూడా పంపారు.
''తర్వాతా టిమ్స్‌లో భర్తీలు అయిపోయాయి. కొందరిని గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాలు చేయాలని డీఎంహెచ్ఓ డైరెక్టర్ మాకు చెప్పారు. కానీ ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటామని చెప్పలేదు. కాంట్రాక్ట్ బేసిక్ మీదనే కదా పనిచేయాల్సింది పర్వాలేదు అనుకుంటూ నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లాం. కానీ అక్కడ సిబ్బందికి మా గురించి ఎలాంటి సమాచారం లేదు. తర్వాత ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి మమ్మల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని ... జీతాలు కూడా ఎప్పుడొస్తాయో చెప్పలేమని చెప్పారు.''