కరోనా ప్రభావంతో గాంధీ ఆస్పత్రి బయటి రోగుల విభాగం వద్ద రద్దీ తగ్గింది. కరోనా వైరస్ అనుమానితులకు ఇక్కడే ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరకి సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున.. గాంధీకి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది.
3వేలకు తగ్గిన ఓపీ సంఖ్య
సాధారణంగా గాంధీ ఆస్పత్రికి ప్రతిరోజు 4వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. కరోనా వెలుగు చూసిన తరువాత.... ప్రతి నిత్యం ఉండే ఓపీ సంఖ్య మూడు వేలకు తగ్గిపోయింది. కరోనా భయంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇప్పుడు గాంధీకి రాకపోవడమే ఇందుకు కారణం.