తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో బ్లాక్​ ఫంగస్​ కలవరం

ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్న శ్రీకాకుళం.. నిన్న కర్నూలు.. తాజాగా కృష్ణా.. ఇలా రాష్ట్రంలో క్రమంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు మరణించగా.. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో వైద్యులకు సూచనలివవ్వడం సహా.. తగిన ఔషధాలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టింది.

black fungus cases in ap
black fungus cases in ap

By

Published : May 17, 2021, 6:38 AM IST

కరోనాతో పోరాడి గెలిచినా.. కొందరిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి కలవరపెడుతోంది. గుజరాత్, మహారాష్ట్రలలో ఇటీవల కలకలం రేపిన బ్లాక్ ఫంగస్ కేసుల ఆనవాళ్లు.. ఏపీలోనూ వెలుగు చూస్తున్నాయి. శ్రీకాకుళం, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో.. పలువురు ఈ ఫంగస్ బారిన పడ్డారు.

కర్నూలు ఆస్పత్రిలో ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వారిలో ఇద్దరు తిరిగి ఆస్పత్రికి వచ్చారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్​లో ఓ యువకుడూ ప్రాణం కోల్పోయాడు. కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. సంబంధిత ఔషధాలను అతి కష్టం మీద సమకూర్చిన అధికారులు.. తగిన చికిత్స అందించారు. మున్ముందు చికిత్సకు అవసరమైన మందుల కొనుగోలుకు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

సాధారణ రోజుల్లో అరుదుగా కనిపించే బ్లాక్‌ ఫంగస్‌ ఇప్పుడు కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించిన సందర్భాల్లో ఈ ఫంగస్‌ ముప్పు ఏర్పడుతోందని వైద్యులు విశ్లేషించారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ప్రమాదం నివారించొచ్చని చెబుతున్నారు.

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:తొలి డోసు తర్వాత కరోనా సోకే అవకాశం తక్కువ!

ABOUT THE AUTHOR

...view details