తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది' - latest news on nara bhuvaneshwari

పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

NTR Trust to support the poor
'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది'

By

Published : Jan 18, 2020, 10:59 PM IST

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 24వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

పేదలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని.. ఫలితంగా ఎంతో మందిని కాపాడవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏపీ సూపర్ స్పెషలిటీ డెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్ కడియాల రాజేంద్ర సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది'

ఇవీ చూడండి: కేటీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలి: రేవంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details