ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరుపేద చిన్నారుల జీవితాల్లో విద్యాకుసుమాలను వికసింపజేయటం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నందమూరి అభిమానులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
మీ సహకారంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు: భువనేశ్వరి - ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ట్రస్ట్ ఛైర్మన్ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ కార్యక్రమం
దాతల సహాయంతో ఇన్నేళ్లుగా ట్రస్ట్ దిగ్విజయంగా సాగుతోందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా పేదలకు ఉచిత విద్య, వైద్య సహాయం, బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని నారా భువనేశ్వరి తెలిపారు.
ఇవీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి