తెలంగాణ

telangana

ETV Bharat / state

సినీనటి జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది ఫిల్మ్ అవార్డు - Dr Maithili Abbaraju received the NTR Award

NTR Shatabdi Film Award To Actress Jayaprada: ప్రముఖ సినీనటి జయప్రదకు ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారం దక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర మహోత్సవ కార్యక్రమంలో, ఎన్టీఆర్ కుమారుాడు రామకృష్ణ చేతుల మీదుగా జయప్రదకు అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ మైథిలీ అబ్బరాజుకు ఎన్టీఆర్‌ అభిమాన సత్కార్‌ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యి ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. అవార్డు పొందినందుకు జయప్రద ఆనందం వ్యక్తం చేసింది.

Actress Jayaprada
Actress Jayaprada

By

Published : Nov 28, 2022, 1:52 PM IST

ప్రముఖ సినీనటి జయప్రదకు.. ఎన్టీఆర్ శతాబ్ది ఫిల్మ్ అవార్డు

NTR Shatabdi Film Award To Actress Jayaprada: ప్రముఖ సినీనటి జయప్రదకు ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారం దక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర మహోత్సవ కార్యక్రమంలో, ఎన్టీఆర్ కుమారుాడు రామకృష్ణ చేతుల మీదుగా జయప్రదకు అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ మైథిలీ అబ్బరాజుకు ఎన్టీఆర్‌ అభిమాన సత్కార్‌ అవార్డు అందజేశారు.

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నెట్టెం రఘురాం, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ అవార్డు దక్కడం చాలా సంతోషాన్నిచ్చిందని.. జయప్రద అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రజల్లో ఆయనపై అభిమానం అంతకంతకూ పెరుగుతోందని.. జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. రాజకీయ నాయకుడిగా, తెలుగు జాతి అభిమానిగా ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. సినీ, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల దూరమైన సూపర్ స్టార్ కృష్ణ గారికి నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details