NSUI attempt to invade TSPSC: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎన్ఎస్యూఐ(National Students Union of India) కార్యకర్తలు యత్నించారు. అంతకముందు గాంధీభవన్ వద్ద కార్యకర్తలు సమావేశం కాగా.. అప్రమత్తమైన పోలీసులు భారీగా గాంధీభవన్‌ను చుట్టుముట్టారు. అనంతరం కార్యకర్తలు గాంధీభవన్ రెండు గేట్ల ద్వారా కమిషన్ కార్యాలయం వైపునకు దూసుకెళ్లారు. వెంటనే పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించడంతో... కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు కార్యాలయం గేట్లు తోసుకుని వెళ్లేందుకు యత్నించారు.
టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నం.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత - nsui muttadi
NSUI attempt to invade TSPSC: ఎన్ఎస్యూఐ కార్యకర్తల ఆందోళనతో హైదరాబాద్ గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ.. కార్యకర్తలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎన్ఎస్యూఐ ముట్టడి
నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.. వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని... అప్పటివరకు ఆందోళన కొనసాగుతోందని ఎన్ఎస్యూఐ నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి'